సూర్యకాంతం ఫేమ్ రాహుల్ విజయ్ హీరోగా నటిస్తున్న కొత్త చిత్రం "మాటే మంత్రము". మేఘా ఆకాష్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు అభిమన్యు బద్ది దర్శకత్వం వహిస్తున్నారు. సుశాంత్ రెడ్డి కథను అందించారు.
తాజాగా ఈ సినిమా నుండి హీరోయిన్ మేఘా ఆకాష్ కు పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తూ మేకర్స్ ఆమె ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ఈ సినిమాలో మేఘ ఆకాష్ 'కావ్య' అనే ఈతరం మేటి యువతిగా నటిస్తున్నట్టు తెలుస్తుంది.
కోట ఫిలిం ఫ్యాక్టరీ, ట్రిప్పి ప్లిక్స్ స్టూడియోస్ బ్యానర్లపై సుశాంత్ రెడ్డి, అభిషేక్ కోట నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని మేఘా ఆకాష్ తల్లి బిందు ఆకాష్ సమర్పిస్తున్నారు. రొమాంటిక్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాలో నటకిరీటి రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.