రాకేష్ శశి డైరెక్షన్లో అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటిస్తున్న రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ "ఊర్వశివో రాక్షసివో". వచ్చే నెల 4న థియేటర్లలో ఈ సినిమా విడుదల కాబోతుంది.
ప్రమోషన్స్ లో భాగంగా ఇప్పటివరకు ఈ సినిమా నుండి విడుదలైన మూడు లిరికల్ సాంగ్స్ కు శ్రోతల నుండి చాలా మంచి స్పందన వస్తుంది. ఎంతలా అంటే, ఈ మూడు లిరికల్ సాంగ్స్ కూడా యూట్యూబు ట్రెండింగ్ మ్యూజిక్ వీడియోస్ లో దూసుకుపోయేంతలా అన్నమాట. అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ ఈ సినిమాకు సంగీత దర్శకులుగా పని చేస్తున్నారు.
దింతనననా, మాయారే, కలిసుంటే... ఈ మూడు పాటలు వేటికవే ప్రత్యేకం. మొదటి పాట అద్భుతంగా పిక్చరైజ్ చేసిన డ్యూయెట్ సాంగ్ ఐతే, రెండోది క్యాచీ లిరిక్స్ తో పాడుకోవడానికి సింపుల్ గా ఉంటుంది. ఇక, మూడోది యూత్ ఫేవరెట్. కలిసుంటే..అనే రొమాంటిక్ సింగిల్