టాలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో సత్యదేవ్ తెలుగులో దసరాకి గాడ్ ఫాదర్, దీపావళికి బాలీవుడ్ లో రామ్ సేతు సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ లతో దూసుకుపోతున్నాడు. సత్యదేవ్ కన్నడ స్టార్ డాలీ ధనంజయతో మల్టీస్టారర్ సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే. ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుపుకుంటుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. సత్యదేవ్ మరియు ధనంజయ ఇద్దరికీ ఇది 26వ ప్రాజెక్ట్.
క్రిమినల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతున్న ఈ చిత్రం ప్రస్తుతం హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వేసిన ఖరీదైన సెట్‌లో చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ సినిమాలో కీలక పాత్రలో నటించేందుకు బహుముఖ నటుడు సత్యరాజ్ ని మాకర్స్ సెలెక్ట్ చేసినట్లు ప్రకటించారు. ఈ చిత్రంలో ప్రియా భవానీ శంకర్ కూడా కీలక పాత్రలో కనిపించనుంది. ఈ ప్రాజెక్ట్ కి సంభందించిన మరిన్ని వివరాలు మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నారు.