మెగాస్టార్ చిరంజీవి గారు ఆచార్య సినిమా డిజాస్టర్ తో కాస్త వెనకడుగు వేసినట్టు కనిపించినా, రీసెంట్గా విడుదలైన గాడ్ ఫాదర్ సినిమాతో తిరిగి ఫామ్ లోకి వచ్చేసారు.
మోహన్ రాజా డైరెక్షన్లో పొలిటికల్ యాక్షన్ డ్రామాగా రూపొందిన ఈ సినిమా తెలుగు, హిందీ, తమిళ భాషలలో విడుదలైంది. తెలుగులో ఈ సినిమా హిట్ టాక్ తో డీసెంట్ కలెక్షన్లను రాబడుతుంది.
తాజాగా మేకర్స్ ఈ సినిమా టైటిల్ వీడియో సాంగ్ ను విడుదల చేసారు. బ్రహ్మ గా చిరంజీవి పవర్ ను, ప్రజల్లో ఆయనకున్న విశేష ఆదరణను కళ్ళకు కట్టినట్టు చూపించే ఈ పాటకు రామజోగయ్య శాస్త్రిగారు అద్భుతమైన లిరిక్స్ ను అందించారు. తమన్ స్వరపరిచారు.
![]() |
![]() |