టాలీవుడ్ యువనటుడు సత్యదేవ్ "రామ్ సేతు" సినిమాతో బాలీవుడ్ డిబట్ చేసిన విషయం తెలిసిందే. ఈ చిత్రం అక్టోబర్ 25 న హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదలైంది.
అక్షయ్ కుమార్, జాక్వేలిన్ ఫెర్నాండెజ్ జంటగా నటించిన ఈ సినిమాలో సత్యదేవ్, నుష్రత్ బరుచ కీరోల్స్ పోషించారు. అభిషేక్ శర్మ డైరెక్షన్లో యాక్షన్ అడ్వెంచరస్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమా తొలి రెండ్రోజుల్లో అమేజింగ్ కలెక్షన్లను రాబట్టింది. ప్రపంచవ్యాప్తంగా మొదటి రోజు 15.25 కోట్లు, రెండో రోజు 11. 40 కోట్లు మొత్తం రెండ్రోజుల్లో పాతిక కోట్లకు పైగానే రాబట్టింది. పర్ఫెక్ట్ దీపావళి ఎంటర్టైనర్ గా ప్రేక్షకులను అలరిస్తుంది ఈ సినిమా.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa