కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ మణిరత్నం దర్శకత్వం వహించిన పొన్నియిన్ సెల్వన్: పార్ట్ 1 సెప్టెంబర్ 30, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ భారీ బడ్జెట్ పీరియడ్ మూవీలో కార్తీ, విక్రమ్, జయం రవి ముఖ్యమైన పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ భారీ మొత్తానికి సొంతం చేసుకున్న సంగతి అందరికి తెలిసందే.
తాజాగా ఇప్పుడు ఈ పీరియాడికల్ యాక్షన్ డ్రామా ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ వీడియోలో తమిళం, తెలుగు, మలయాళం మరియు కన్నడ భాషల్లో ప్రసారం చేయడానికి అందుబాటులో ఉంది. అయితే ప్రస్తుతానికి ఈ సినిమా రెంటల్ బేస్ పై అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రం నవంబర్ 4, 2022 నుండి ప్రైమ్ వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుందని OTT ప్లాట్‌ఫారమ్ ప్రకటించింది.
ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తుండగా, శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్‌ని అందిస్తున్నారు. 250 కోట్ల భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాని మద్రాస్ టాకీస్‌తో కలిసి లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తుంది.