నేనే వస్తున్నా :
సెల్వరాఘవన్ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటించిన 'నానే వరువేన్' సినిమా సెప్టెంబర్ 29, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా తెలుగు వెర్షన్ 'నేనే వస్తున్నా' అనే టైటిల్ తో విడుదలయ్యింది. ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఇప్పుడు ఈ సినిమా అక్టోబర్ 27 నుంచి అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి వచ్చింది.
ఈ సినిమాలో ఎల్లి అవ్రామ్ అండ్ ఇందుజా రవిచంద్రన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ప్రభు, యోగిబాబు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాలో సెల్వరాఘవన్ కూడా ఒక ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. వి క్రియేషన్స్ నిర్మిస్తున్న ఈ సినిమాలో ధనుష్ విలన్‌గా కూడా కనిపించనున్నారు. ఈ యాక్షన్ థ్రిల్లర్‌కి యువన్ శంకర్ రాజా సంగీతం అందించారు.
ఝాన్సీ :
తిరు మరియు గణేష్ కార్తీక్ దర్శకత్వం వహించిన 'ఝాన్సీ' వెబ్ సిరీస్ అక్టోబర్ 27న డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో విడుదలైంది. ఈ సిరీస్ లో అంజలి, చాందిని చౌదరి, ఆదర్శ్ బాలకృష్ణ ఇతరలు ప్రధాన పాత్రల్లో నటించారు.