కోలీవుడ్ సూపర్ స్టార్, తలైవర్ రజినీకాంత్ 71 పడిలోనూ జోరుగా సినిమాలు చేస్తూ, యువ నటీనటులకు సవాలు విసురుతున్నారు. ప్రస్తుతం రజినీ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్లో "జైలర్" సినిమా చేస్తున్నారు. ఇది రజిని కెరీర్ లో చేస్తున్న 169వ సినిమా.
తాజా సమాచారం మేరకు, రజినీకాంత్ తన 170, 171 సినిమాలను ప్రముఖ కోలీవుడ్ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ లో చేస్తున్నారని తెలుస్తుంది. ఈ రెండు సినిమాల పూజా కార్యక్రమాలు నవంబర్ 5వ తేదీన చెన్నైలో లాంఛనంగా జరగనున్నాయట. ఈ విషయమై, కొన్నిరోజుల నుండి సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది.
మరి, ఈ రెండు సినిమాల డైరెక్టర్లు, నటీనటులు, సాంకేతిక నిపుణులు ఎవరన్నది అధికారికంగా తెలియల్సి ఉంది.