ప్రముఖ హీరో సిద్దార్ధ్, బాలీవుడ్ హీరోయిన్ అదితి రావ్ హైదరీని పెళ్లి చేసుకోబోతున్నాడంటూ కొన్ని రోజుల క్రితం మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. వీరిద్దరూ కలిసి "మహాసముద్రం" సినిమాలో నటించారు. అజయ్ భూపతి డైరెక్ట్ చేసిన ఆ సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. దీంతో ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద ఫ్లాప్ గా నిలిచింది. కానీ, ఆ సినిమాలో కలిసి నటించిన సిద్దార్థ్, అదితిల ప్రేమ మాత్రం హిట్టయ్యిందని సోషల్ మీడియా టాక్.
ఈ రోజు అదితి పుట్టినరోజు. దీంతో సిద్దార్థ్ తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అదితికి స్పెషల్ బర్త్ డే విషెస్ తెలియచేస్తూ, అదితితో కలిసి దిగిన ఫోటో షేర్ చేసాడు. ఈ మేరకు ఆమెను ప్రిన్సెస్ ఆఫ్ హార్ట్ అని అనడం హాట్ టాపిక్ గా మారింది. దీంతో త్వరలోనే వీరిద్దరూ పెళ్లి చేసుకొని, ఒకటవ్వాలని ప్రేక్షకులు కోరుకుంటున్నారు.