కన్నడ నటుడు రిషబ్ శెట్టి హీరోగా, సప్తమి గౌడ హీరోయిన్ గా నటించిన చిత్రం "కాంతార". ముందు కన్నడలో విడుదలై, ఆ వెంటనే పాన్ ఇండియా భాషల్లో విడుదలైన ఈ సినిమా ప్రతి చోటా విశేష ఆదరణ దక్కించుకుంటుంది.
ముఖ్యంగా తెలుగులో ఈ సినిమా అమేజింగ్ కలెక్షన్లను రాబడుతూ, రీజినల్ సినిమాలకు పెను సవాలుగా మారింది. అక్టోబర్ 15న తెలుగులో విడుదలైన కాంతార నిన్నటితో అంటే 13 రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 45 కోట్ల గ్రాస్ మార్క్ ను అందుకుంది. ఈ వీకెండ్ పూర్తయ్యేసరికల్లా తెలుగులో యాభై కోట్ల క్లబ్ లోకి చేరే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. చూడాలి మరి, కాంతార తెలుగులో యాభై కోట్ల మార్క్ అందుకుంటుందో లేదో...!!
తెలుగులో ఈ సినిమాకొస్తున్న విశేష స్పందన కారణంగా రేపు ఆంధ్రప్రదేశ్ లో కాంతార సక్సెస్ టూర్ జరగనుంది.