ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఓపెనింగ్ షెడ్యూల్ పూర్తి చేసుకున్న ప్రభాస్-మారుతి సినిమా

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 06:32 PM

మారుతీ డైరెక్షన్ లో టాలీవుడ్ యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ ఒక సినిమా చేస్తున్న సంగతి అందరికి తెలిసందే. కొద్దిరోజుల క్రితమే ఈ పాన్-ఇండియన్ సినిమా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా ఓపెనింగ్ షెడ్యూల్‌ను ముగిచినట్లు సమాచారం. దాదాపు వారం రోజుల పాటు షూట్ చేసిన ఈ షెడ్యూల్ హైదరాబాద్‌లో పూర్తయింది.


ఈ సినిమాకి "రాజా డీలక్స్" అనే టైటిల్ ని మూవీ మేకర్స్ లాక్ చేసినట్లు సోషల్ మీడియాలో వార్తలు వినిపిస్తున్నాయి. క్రైమ్ కామెడీ ట్రాక్ లో రానున్న ఈ సినిమాలో ప్రభాస్ సరసన మాళవిక మోహనన్ జోడిగా కనిపించనుంది. అందరూ ఎంతో ఆశక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా 2023లో థియేటర్లలో విడుదల కానుంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని నిర్మిస్తుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com