టాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని పవర్‌ఫుల్ డైరెక్టర్ బోయపాటి శ్రీనుతో పాన్-ఇండియా సినిమాని ప్రకటించిన సంగతి అందరికి తెలిసందే. ఈ చిత్రం తెలుగు, హిందీ, తమిళం, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమాకి మూవీ మేకర్స్ ఇంకా టైటిల్ ని లాక్ చేయలేదు. ఈ పాన్-ఇండియన్ మూవీ టెంపరరీగా 'RAPO 20' పేరుతో హైదరాబాద్‌లో పూజా కార్యక్రమంతో అధికారికంగా ప్రారంభించబడింది. ఈ సినిమాలో రామ్ సరసన శ్రీ లీల జోడిగా నటిస్తుంది.
తాజాగా ఇప్పుడు, మిస్ ఇండియా విజేత ఊర్వశి రౌతేలా ఈ సినిమాలో ఐటెమ్ సాంగ్ చేయనున్నట్లు సమాచారం. ప్రస్తుతం హైదరాబాద్‌లో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో వీరిద్దరిపై థమన్ కంపోజ్ చేసిన ఫుట్‌టాపింగ్ సాంగ్ చిత్రీకరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఫుల్ మాస్ ఎలిమెంట్స్‌తో రానున్న ఈ సినిమాని శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ బ్యానర్‌పై శ్రీనివాస చిట్టూరి నిర్మిస్తున్నారు.