ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ జర్నీ గా ఆకట్టుకుంటున్న "ఆకాశం" ట్రైలర్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 07:18 PM

అశోక్ సెల్వన్ హీరోగా నటిస్తున్న ఆకాశం ట్రైలర్ కొంచెంసేపటి క్రితమే విడుదలయ్యింది. నాచురల్ స్టార్ నాని ఈ ట్రైలర్ ను డిజిటల్ లాంచ్ చేసారు.


ట్రైలర్ ఆద్యంతం ఎమోషనల్ అండ్ ఎంగేజింగ్ గా సాగింది. హీరో తన జీవితంలో ఎదుర్కొన్న విపత్కర పరిస్థితులు, వాటి ప్రభావం తనని ఎంతలా కుంగదీస్తున్నాయి? ఈ నేపథ్యంలో రీతూవర్మతో హీరో చేసే ట్రావెల్, ఈ జర్నీతన లైఫ్ లో మెమొరబుల్ గా ఎలా మారింది? ... మొత్తంగా సినిమా ఒక ఫీల్ గుడ్ ఎమోషనల్ లవ్ ఎంటర్టైనర్ గా ఉండబోతుందని తెలుస్తుంది.


అపర్ణా బాలమురళి, రీతువర్మ, శివాత్మిక రాజశేఖర్ హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాకు రా కార్తీక్ దర్శకత్వం వహించారు. వయాకామ్ 18 స్టూడియోస్, శ్రీనిధి సాగర్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు గోపీసుందర్ సంగీతం అందించారు. పోతే, ఈ చిత్రం నవంబర్ 4న తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com