సూపర్ స్టార్ రజనీకాంత్ తో లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ రెండు సినిమాలను నిర్మించనుంది. ఈ విషయాన్ని నిర్మాతలు ధృవీకరించారు.ఈ రెండు ప్రాజెక్టులను నవంబర్ 5న చెన్నైలో ఒకేసారి ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఈ రెండు సినిమాలను సంబంధించిన దర్శకుల పేర్లను త్వరలో అధికారికంగా ప్రకటిస్తామని లైకా ప్రొడక్షన్స్ చైర్మన్ సుభాస్కరన్ తెలిపారు.