అక్టోబర్ 21వ తేదీన RRR సినిమా జపాన్లో విడుదలైన విషయం తెలిసిందే. ఈ మేరకు జపాన్లో ప్రమోషన్స్ నిర్వహించడానికి స్వయంగా రాజమౌళి, తారక్, రాంచరణ్ వెళ్లారు. ఈ సినిమాకు అక్కడి ప్రజలు నీరాజనాలు పలుకుతున్నారు.
ఇదిలా ఉండగా, మరొక సినిమా కూడా జపాన్లో విడుదల కావడానికి రెడీ అవుతుంది. ఐతే ఈ సారి జపాన్లో విడుదల కాబోయేది తెలుగు సినిమా కాదు, తమిళ సినిమా. గతేడాది విడుదలైన తలపతి విజయ్ సూపర్ హిట్ మూవీ "మాస్టర్" నవంబర్ 18వ తేదీన జపాన్లో విడుదల కాబోతుంది.
లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో పక్కా యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ సినిమాలో విలక్షణ నటుడు విజయ్ సేతుపతి విలన్గా నటించారు. మాళవిక మోహనన్ హీరోయిన్ గా నటించింది. అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించారు.