రౌడీ హీరో విజయ్ దేవరకొండ చేతిలో ప్రస్తుతం ఖుషి సినిమా మాత్రమే ఉంది. పూరి జగన్నాధ్ డైరెక్షన్లో రీసెంట్గా అఫీషియల్ గా ప్రకటింపబడిన JGM, లైగర్ డిజాస్టర్ కారణంగా క్యాన్సిల్ అయ్యిందని అంటున్నారు. ఐతే, ఈ సినిమాపై ఇంకా ఎలాంటి అధికారిక సమాచారం లేదు.
విజయ్ దేవరకొండ నెక్స్ట్ మూవీపై లేటెస్ట్ గా ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. గౌతమ్ తిన్ననూరి డైరెక్షన్లో విజయ్ ఒక సినిమాను చేస్తున్నారని, అందుకు ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజుగారు నిర్మాతగా వ్యవహరిస్తున్నారని అంటున్నారు. మరి, ఈ విషయంలో అధికారిక సమాచారం రావలసి ఉంది.