ట్రెండింగ్
Epaper    English    தமிழ்

'కాంతారా' డిజిటల్ స్ట్రీమింగ్ పై లేటెస్ట్ బజ్

cinema |  Suryaa Desk  | Published : Fri, Oct 28, 2022, 08:53 PM

రిషబ్ శెట్టి దర్శకత్వం వహించిన కన్నడ యాక్షన్ డ్రామా 'కాంతారా' తెలుగు డబ్బింగ్ వెర్షన్ అక్టోబర్ 14న రిలీజ్ అయ్యింది. ఈ సినిమా పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద సాలిడ్ కలెక్షన్స్ ని రాబడుతుంది. అల్లు అరవింద్ తెలుగులో విడుదల చేసిన ఈ సినిమా కన్నడలో బిగ్గెస్ట్ హిట్ గా నిలిచింది.


లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, ఈ సినిమా నవంబర్ 4, 2022న అమెజాన్ ప్రైమ్ వీడియోలో డిజిటల్ స్ట్రీమింగ్ కి అందుబాటులోకి రానుంది అని వార్తలు వినిపిస్తున్నాయి. అయితే, ఈ విషయం గురించి OTT ప్లాట్‌ఫారమ్‌ ఇంకా అధికారిక ప్రకటన ఇవ్వలేదు.

ఈ చిత్రానికి దర్శకత్వం వహించడమే కాకుండా రిషబ్ శెట్టి ఈ సినిమాలో ప్రధాన పాత్ర పోషించాడు. ఈ యాక్షన్-థ్రిల్లర్ సినిమాలో ప్రమోద్ శెట్టి, అచ్యుత్ కుమార్ మరియు నవీన్ డి పాడిల్ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్‌పై విజయ్ కిరగందూర్ నిర్మించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com