ఇటీవల తెలుగులో విడుదలైన స్వాతిముత్యం సినిమాలో హీరోయిన్ గా నటించింది వర్ష బొల్లమ్మ. ఈ సినిమా వర్షకు చాలా మంచి గుర్తింపును తీసుకొచ్చింది.
తాజాగా వర్ష ఒక కోలీవుడ్ నిర్మాత కొడుకును పెళ్లి చేసుకోబోతుందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరిగింది. వీటిపై వర్ష చాలా ఘాటుగా స్పందిస్తూ, ట్వీట్ చేసింది. తన కోసం తనకే తెలియకుండా ఒక పెళ్ళికొడుకుని వెతికి పెట్టినందుకు పలు వెబ్సైట్లకు థాంక్స్ చెప్తూ, ఆ అబ్బాయి ఎవరో చెప్తే, తన ఇంట్లోవాళ్లకు కూడా చెప్పేస్తా అంటూ వర్ష ట్వీట్ చేసింది. ప్రస్తుతానికి తన పెళ్లి చూపులు చూడాలని ఎవరైనా అనుకుంటే, ఆహాలో స్ట్రీమింగ్ అవుతున్న స్వాతిముత్యం చూడండి అంటూ ఫేక్ న్యూస్ అని ట్యాగ్ చేసింది. దీంతో ఈ అమ్మడి పెళ్లి వార్తలు కేవలం పుకార్లే అని తేలింది.