సూపర్ స్టార్ రజినీకాంత్ కు ఒక అలవాటు ఉంది. ఏ కొత్త సినిమా విడుదలైనా చూసి, ఒకవేళ బాగా నచ్చితే ఆయా చిత్రబృందాలకు శుభాకాంక్షలను తెలుపుతూ, సోషల్ మీడియాలో ట్వీట్ చేస్తారు. లేకపోతే, డైరెక్ట్ గా కాల్ చేసి అభినందిస్తారు.
రీసెంట్ కన్నడ సెన్సేషన్ "కాంతార"ను రజినీకాంత్ చూడడం జరిగింది. రజిని ఈ సినిమా చూసి అమేజింగ్ గా ఫీల్ అవ్వడంతో, రిషబ్ శెట్టిని, హోంబలే ఫిలిమ్స్ ను, నటీనటులను ఒక రేంజులో పొగిడేస్తూ, ట్వీట్ చేసారు. నిన్న రజినీకాంత్ గారు రిషబ్ శెట్టిని తన స్వగృహానికి ఆహ్వానించి, పట్టు శాలువా కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా రిషబ్ శెట్టితో చాలాసేపు ముచ్చటించారు. ప్రస్తుతం అందుకు సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతున్నాయి.