కే ఎస్ రవీంద్ర (బాబీ) డైరెక్షన్లో మెగాస్టార్ చిరంజీవి, మాస్ రాజా రవితేజ కలిసి నటిస్తున్న మల్టీస్టారర్ "వాల్తేరు వీరయ్య". ఇటీవల విడుదలైన ఈ మూవీ టైటిల్ ఎనౌన్స్మెంట్ టీజర్ ఏపాటి హంగామా చేసిందో అందరికి తెలిసిందే. మెగాస్టార్ మాస్ ఈజ్, వింటేజ్ చిరుని కళ్ళకు కట్టినట్టు ఈ సినిమాలో చూపించబోతున్నారు మేకర్స్.
తాజాగా ఈ సినిమాపై వెరీ ఇంట్రెస్టింగ్ బజ్ ఒకటి వినిపిస్తుంది. నవంబర్ 14వ తేదీన అంటే సోమవారం వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ రిలీజ్ కావడానికి రెడీ అవుతుందని టాక్. అదికూడా చిరు, రవితేజ కలిసి ఊరమాస్ స్టెప్స్ వేసే సాంగ్ అని అంటున్నారు. ఈ మేరకు త్వరలోనే మేకర్స్ అఫీషియల్ ఎనౌన్స్మెంట్ చెయ్యనున్నారట.
శృతి హాసన్, క్యాథెరిన్ ట్రెసా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది.