కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న తొలి తమిళ, తెలుగు బై లింగువల్ మూవీ "వాతి". తెలుగులో "సార్" టైటిల్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాకు టాలీవుడ్ దర్శకుడు వెంకీ అట్లూరి డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
డిసెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కావడానికి శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమా యొక్క ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ బజ్ వినిపిస్తుంది. అతి త్వరలోనే ఈ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ కాబోతుందంట. విశేషమేంటంటే, ఈ పాటకు స్వయంగా ధనుష్ లిరిక్స్ అందించారు. సో, ఈ పాటపై ఇప్పటినుండే మంచి అంచనాలు నెలకొన్నాయి.
సంయుక్తా మీనన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాకు జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందిస్తున్నారు.