'హుషారు' సినిమాతో దక్ష నగార్కర్ తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకుంది. 'జాంబిరెడ్డి'లో మంచి నటన కనబరిచింది. అయితే అందానికి లోటు లేని దక్షకు సరైన అవకాశాలు రాలేదు. ఇదిలావుంటే సోషల్ దక్ష మీడియాలో యమా యాక్టివ్ ఉంటుంది. దక్ష ప్రస్తుతం రవితేజ హీరోగా రావణాసుర చిత్రంలో నటిస్తుంది. యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో మేఘా ఆకాష్, అను ఇమ్మాన్యుయేల్, దక్షనాగార్కర్, పూజిత పొన్నాడ, జాతిరత్న ఫేమ్ ఫరియా అబ్దుల్లా హీరోయిన్లుగా నటిస్తున్నారు. మరో కీలక పాత్రలో సుశాంత్ కనిపించనున్నాడు. ఈ సినిమాలో రవితేజ లాయర్ గా కనిపించనున్నాడని తెలుస్తోంది.