తలపతి విజయ్ నటిస్తున్న కొత్త చిత్రం "వారిసు". టాలీవుడ్ డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా, తమన్ సంగీతం అందిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. తాజా సమాచారం ప్రకారం, వారిసు ఆడియో రైట్స్ ను ప్రముఖ మ్యూజిక్ ప్రొడక్షన్ సంస్థ టి సిరీస్ చేజిక్కించుకుంది.
రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై దిల్ రాజు నిర్మిస్తున్నారు. పోతే, తెలుగులో ఈ సినిమా "వారసుడు" టైటిల్ తో డబ్ కాబోతున్న విషయం తెలిసిందే.