మెగా బ్రదర్ నాగబాబు గారు ఈ రోజు 61వ పుట్టినరోజును జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా వరుణ్ తేజ్ అప్ కమింగ్ ప్రాజెక్ట్ VT 12 చిత్రబృందం నుండి నాగబాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియచేస్తూ స్పెషల్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. ఈ చిత్రానికి నాగబాబు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు.
నటుడిగా, నిర్మాతగా, బుల్లితెర స్టార్ సెలెబ్రెటీగా, రాజకీయ నాయకుడిగా ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు నాగబాబు గారు. ప్రస్తుతానికి సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేస్తూ ఒకపక్క, తమ్ముడు పవన్ కళ్యాణ్ నిర్వహించే రాజకీయ సమావేశాలకు హాజరవుతూ మరోపక్క ఫుల్ బిజీగా ఉన్నారు.
అన్నయ్య చిరంజీవితో నిర్మించిన తొలి చిత్రం "రుద్రవీణ"కు గానూ నాగబాబు గారు నేషనల్ అవార్డును అందుకున్నారు.