కన్నడ బ్లాక్ బస్టర్ సెన్సేషనల్ హిట్ "కాంతార" అన్ని భాషల ప్రేక్షకులను విశేషంగా అలరిస్తుంది. ఈ సినిమాలోని వరాహరూపం పాట కూడా అంతే పెద్ద హిట్టయ్యింది. మలయాళ మ్యూజిక్ ఆల్బమ్ "నవరసం" కు ఇది కాపీ అని, తమ అనుమతి లేకుండా సినిమాలో ఈ పాటను పెట్టడంతో నవరసం మ్యూజిక్ ఆల్బమ్ మేకర్స్ కాంతార మేకర్స్ పై లీగల్ యాక్షన్ కు దిగిన విషయం తెలిసిందే కదా.
తాజాగా ఈ విషయంలో కోర్టు నవరసం మేకర్స్ కు అనువుగా తీర్పును ఇచ్చినట్టు తెలుస్తుంది. ఈ విషయాన్ని అధికారికంగా తెలుపుతూ తైక్కుదాం బ్రిడ్జ్ ఇన్స్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ పెట్టింది. "కేరళ, కోజికోడ్ సెషన్స్ కోర్టు కాంతార డైరెక్టర్, ప్రొడ్యూసర్, మ్యూజిక్ డైరెక్టర్, అమెజాన్, యూట్యూబ్, జియో సావన్, స్పాటి ఫై,తదితర మాధ్యమాలలో వరాహరూపం సాంగ్ ను ప్లే చెయ్యకూడదని ఒక చెయ్యాలంటే, తమ అనుమతి తీసుకోవాలని తీర్పును ఇచ్చింది " అంటూ పోస్ట్ లో రాసుకొచ్చింది.
మరి ఈ విషయంలో కాంతార మేకర్స్ ఎలాంటి నెక్స్ట్ స్టెప్ తీసుకుంటారో చూడాలి.