నవీన్ చంద్ర, దివ్య పిళ్ళై జంటగా నటించిన చిత్రం తగ్గేదేలే. ఈ సినిమాలో వీరిద్దరిపై మాటే మంత్రము అనే బ్యూటిఫుల్ వింటేజ్ మెలోడీని అంతే అందంగా పిక్చరైజ్ చేసారు. సీతాకోకచిలుక సినిమాలోని మాటే మంత్రము అనే ఎవర్గ్రీన్ హిట్ సాంగ్ ను యాజిటీజ్ గా ఈ సినిమాలో వాడేశారు సంగీత దర్శకుడు చరణ్ అర్జున్. SP బాలసుబ్రహ్మణ్యం, శైలజ ఆలపించిన ఈ పాటకు వేటూరి సుందరరామమూర్తి గారు సాహిత్యం అందించారు. ఇళయరాజా గారు కంపోజ్ చేసారు. తగ్గేదేలే చిత్రంలోని ఈ పాట యూట్యూబులో విడుదలై వారం రోజులు గడుస్తున్నా ఇంకా ట్రెండింగ్ లోనే కొనసాగుతుండడం విశేషం.
నవంబర్ 4వ తేదీన విడుదల కాబోతున్న ఈ చిత్రానికి శ్రీనివాసరాజు దర్శకుడు. భద్ర ప్రొడక్షన్స్ బ్యానర్ పై ప్రేమ్ కుమార్ పాండే, అఖిలేష్ రెడ్డి, సుబ్బా రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.