థియేటర్లను షేకాడించిన బింబిసారుడు తాజాగా డిజిటల్ ఎంట్రీ ఇచ్చి అక్కడ కూడా దుమ్ము రేపుతున్నాడు. రీసెంట్గానే పదికోట్ల నిమిషాల స్ట్రీమింగ్ మినిట్స్ ను పూర్తి చేసుకుని రికార్డులకెక్కిన ఈ మూవీ తాజాగా జీ 5 ఇండియా ట్రెండింగ్ టాప్ వన్ పొజిషన్ లో దూసుకుపోతుంది. బిగ్ స్క్రీన్ మరియు డిజిటల్ స్క్రీన్ .. ఈ రెండిటిపై బింబిసారుడి ఏకఛత్రాధిపత్యం సాగిస్తుండడం విశేషం.
కొత్త దర్శకుడు వశిష్ట తెరకెక్కించిన ఈ సోసియో ఫాంటసీ యాక్షన్ డ్రామాలో నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నటించగా, క్యాథెరిన్ ట్రెస్సా, సంయుక్తా మీనన్ హీరోయిన్స్ గా నటించారు. శ్రీనివాసరెడ్డి, వైవా హర్ష, ప్రకాష్ రాజ్ కీలకపాత్రలు పోషించారు. చిరంతన్ భట్, ఎం ఎం కీరవాణి సంగీతం అందించారు.