ప్రముఖ ఫుట్ బాల్ క్రీడాకారుడు టామ్ బ్రాడీ, అతని భార్య, సూపర్ మోడల్-భార్య గిసెల్ బాండ్చెన్ విడాకులు తీసుకోనున్నారు. తమ 13 సంవత్సరాల వైవాహిక బంధానికి ముగింపు పలకనున్నట్లు వారు తెలిపారు. "ఇలా చేయడం బాధాకరమైనది. కష్టతరమైనది... అయినప్పటికీ మేము ఒకరికొకరు మంచిని మాత్రమే కోరుకుంటున్నాము" అని టామ్ పేర్కొన్నాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు.