క్రేజీ హీరోయిన్ సమంత సోషల్ మీడియాలో ఫోటోలు, ప్రమోషనల్ యాడ్లు, మోటివేషనల్ కోట్స్ పోస్ట్ చేస్తూ ఎంతో చురుగ్గా ఉండేది. కొన్నాళ్ళబట్టి ఆమె సోషల్ మీడియాలో ఎలాంటి అప్డేట్స్ ఇవ్వకపోవడంతో, చాలా మంది సమంత హెల్త్ కండీషన్ బాగోలేదని, అందుకే తరచుగా అమెరికా వెళ్లొస్తుందని, సినిమా షూటింగ్లు, ప్రమోషన్స్ లో ఈ కారణం చేతనే పాల్గొనట్లేదని అనుకున్నారు. కానీ, సమంత క్లోజ్ సర్కిల్ ఈ వార్తలను కొట్టిపారేసింది.
కానీ, ఇదే నిజమంటూ సమంత లేటెస్ట్ ఇన్స్టా పోస్ట్ లో రాసుకొచ్చింది. ఒక రకమైన ఆటో ఇమ్యూన్ డిజార్డర్ మయోసైటిస్ అనే వ్యాధితో తాను బాధపడుతున్నట్టు తెలిపింది. కొన్ని నెలల క్రితమే ఈ వ్యాధికి ట్రీట్మెంట్ తీసుకున్నానని, కోలుకోవడానికి మాత్రం అనుకున్న సమయానికన్నా కొంచెం ఎక్కువగానే పట్టేటట్లుందని, ప్రేక్షకుల ప్రేమాభిమానాలే ఇలాంటి ఎన్నో క్లిష్టపరిస్థితులను ఎదుర్కొనే ధైర్యం ఇస్తుందని, యశోద ట్రైలర్ కు వస్తున్న రెస్పాన్స్ తనకు చాలా సంతోషాన్ని కలిగిస్తుందని రాసుకొచ్చింది.
ఈ పోస్ట్ కు తాను యశోదకు డబ్బింగ్ చెప్తున్న ఫోటోను జత చేసింది. ఈ ఫొటోలో సమంత చేతికి సెలైన్ పెట్టి ఉంది.