టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి దర్శకుడు బాబీతో ఒక సినిమా చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఈ ప్రాజెక్ట్ లో చిరు సరసన టాలెంటెడ్ అండ్ గార్జియస్ యాక్ట్రెస్ శృతి హాసన్ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకు 'వాల్టెయిర్ వీరయ్య' అనే టైటిల్ ను మూవీ మేకర్స్ లాక్ చేసారు. ఈ సినిమాలో రవితేజ వైజాగ్ రంగారావు గా ఔట్ అండ్ అవుట్ మాస్ పోలీస్ గా కనిపించనున్నాడు అని లేటెస్ట్ టాక్.
ప్రముఖ డిస్ట్రిబ్యూషన్ సంస్థ శ్లోకా ఎంటర్‌టైన్‌మెంట్స్ 'వాల్టెయిర్ వీరయ్య' USA రైట్స్ ని సొంతం చేసుకున్నట్లు ఫిలిం ఇండస్ట్రీలో వార్తలు వినిపిస్తున్నాయి. మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్ ట్రాక్ లో రానున్న ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో బాబీ సింహా పవర్‌ఫుల్ విలన్‌గా నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ భారీ స్థాయిలో నిర్మిస్తుంది.