ట్రెండింగ్
Epaper    English    தமிழ்

కొరమీను మోషన్ పోస్టర్ రిలీజ్... మరోసారి నటుడిగా మారిన రైటర్

cinema |  Suryaa Desk  | Published : Sat, Oct 29, 2022, 06:32 PM

2014లో విడుదలైన ప్రతినిధి సినిమాతో రచయితగా ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చారు ఆనంద్ రవి. ఆపై హీరోగా, డైరెక్టర్ గా మారి నెపోలియన్ అనే సినిమాను తెరకెక్కించారు.


తాజాగా ఆనంద్ రవి హీరోగా నటిస్తున్న కొత్త సినిమా "కొరమీను". కొంచెంసేపటి క్రితమే ఈ మూవీ టైటిల్ మోషన్ పోస్టర్ రిలీజ్ అయ్యింది. శ్రీపతి కర్రీ ఈ సినిమాకు దర్శకుడిగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకు స్టోరీ, స్క్రీన్ ప్లే, డైలాగ్స్ ఆనంద్ రవినే అందిస్తున్నారు. కిషోరీ ధాత్రక్ హీరోయిన్ గా నటిస్తుంది. ఫుల్ బాటిల్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై పెళ్లకూరు సామాన్య రెడ్డి ఈ సినిమాను నిర్మిస్తున్నారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa