బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ తల్లి జీనత్ హుస్సేన్ గుండెపోటుకు గురయ్యారు. దీంతో వెంటనే ఆమెను ముంబైలోని బ్రీచ్ కాండీ ఆసుపత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటున్నారని, చికిత్సకు స్పందిస్తున్నారని బాలీవుడ్ వర్గాలు తెలిపాయి. ప్రస్తుతం అమీర్ ఖాన్ మరియు ఇతర కుటుంబ సభ్యులు ఆసుపత్రిలో ఉన్నట్లు సమాచారం.