కాంతార... ఈ మధ్య వార్తల్లో బాగా వినిపిస్తున్న పేరు. ప్రాంతీయ కన్నడ సినిమాగా విడుదలైన కాంతార దేశవ్యాప్త ప్రజల దృష్టిని ఒక్కసారిగా తనవైపుకు తిప్పుకుని, దానంతట అదే పాన్ ఇండియా సినిమా క్రేజ్ ను సంపాందించుకుంది.
రిషబ్ శెట్టి డైరెక్ట్ చేసి, హీరోగా నటించిన కాంతార సినిమాను హోంబలే ఫిలిమ్స్ సంస్థ నిర్మించింది. తెలుగులో ఈ సినిమాను ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ గారు విడుదల చేసారు. ఇరు తెలుగు రాష్ట్రాలలో కాంతారకు అద్దిరిపోయే రెస్పాన్స్ వస్తుంది. దీంతో కాంతార టీం పోస్ట్ రిలీజ్ ప్రమోషన్స్ లో భాగంగా నేడు వైజాగ్ లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ నేపథ్యంలో వైజాగ్ కొచ్చిన రిషబ్ శెట్టి మరియు టీం సింహాచలం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకుని, ప్రత్యేక పూజలు చేశారు. అందుకు సంబంధించిన పిక్స్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి.