రౌడీ హీరో విజయ్ దేవరకొండ క్రేజీ హీరోయిన్ సమంత తో కలిసి ఫస్ట్ టైం ఫుల్ లెంగ్త్ సినిమా చేస్తున్నాడు. అదే శివ నిర్వాణ డైరెక్షన్లో తెరకెక్కుతున్న "ఖుషి". సమంత ఆరోగ్యసమస్యలు వగైరా.., కారణంగా ఈ సినిమా షూటింగ్ కొన్ని వారాల బట్టి జరగట్లేదు. మయోసైటిస్ తో బాధపడుతున్న సమంత పూర్తిగా కోలుకుంటే తప్ప ఖుషి మూవీ కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యే పరిస్థితి లేదు.
ఈ నేపథ్యంలో విజయ్ తన నెక్స్ట్ సినిమాను స్టార్ట్ చెయ్యాలని చూస్తున్నాడట. జరుగుతున్న ప్రచారం మేరకు, విజయ్, జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి తో ఒక సినిమా చెయ్యడానికి ఒప్పుకున్నాడు. ఈ సినిమాకు దిల్ రాజు నిర్మాత గా వ్యవహరించనున్నారు. ఎలాంటి అఫీషియల్ ఇన్ఫర్మేషన్ లేని ఈ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వచ్చే నెల నుండే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట మేకర్స్. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.