వరుణ్ ధావన్, కృతి సనన్ జంటగా నటిస్తున్న సినిమా "భేడియా". అమర్ కౌశిక్ ఈ సినిమాకు డైరెక్టర్. భారతదేశపు తొలి క్రియేచర్ కామెడీ ఎంటర్టైనర్ గా రూపొందిన ఈ మూవీ నవంబర్ 25వ తేదీన హిందీ, తెలుగు, తమిళ భాషలలో విడుదల కాబోతుంది.
రీసెంట్గానే ఈ సినిమా నుండి 'తుమ్కేశ్వరి' వీడియో సాంగ్ విడుదలైంది. పాట చివరిలో క్రేజీ హీరోయిన్ శ్రద్ధాకపూర్ గెస్ట్ అప్పియరెన్స్ సాంగ్ హైలైట్ గా నిలిచింది. ఉత్తరాదిన ఈ పాట వీరలెవెల్లో దూసుకుపోతుంది. కొంచెంసేపటి క్రితమే తెలుగులో కూడా ఈ పాట విడుదలైంది. కార్తీక్, అనూష మణి పాడగా, అమితాబ్ భట్టాచార్య సాహిత్యం అందించారు. సచిన్ జిగర్ సంగీతం అందించారు. గణేష్ ఆచార్య కొరియోగ్రఫీ చేసారు.