సంతోష్ శోభన్, ఫరియా అబ్దుల్లా జంటగా నటిస్తున్న ట్రావెల్ కామెడీ అడ్వెంచరస్ థ్రిల్లర్ లైక్ షేర్ సబ్స్క్రైబ్. మేర్లపాక గాంధీ ఈ సినిమాను డైరెక్ట్ చేసారు.
తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ థర్డ్ లిరికల్ సాంగ్ ను విడుదల చెయ్యడానికి రంగం సిద్ధం చేసారు. ఈ మేరకు ఈ రోజు సాయంత్రం 04:05 నిమిషాలకు లచ్చమమ్మో అనే వీడియో సాంగ్ విడుదల కాబోతుంది. రామ్ మిరియాల ఈ పాటను ఆలపించారు.
నెల్లూరు సుదర్శన్, బ్రహ్మాజీ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ చిత్రం నవంబర్ 4న విడుదల కాబోతుంది.