ఇండియాలో టాప్ రేటెడ్ టాక్ షో గా రికార్డు సృష్టిస్తుంది నటసింహం నందమూరి బాలకృష్ణగారు హోస్ట్ చేస్తున్న అన్ స్టాపబుల్ విత్ NBK. ఈ మధ్యనే ఈ షో యొక్క సెకండ్ సీజన్ స్టార్ట్ ఐన విషయం తెలిసిందే కదా. ఫస్ట్ ఎపిసోడ్ కు నారా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్, రెండో ఎపిసోడ్ కు విశ్వక్ సేన్, సిద్దూ జొన్నలగడ్డ చీఫ్ గెస్ట్ లుగా పాల్గొని షోని చాలా ఇంట్రెస్టింగ్ గా కొనసాగించారు.
తాజాగా ఈ టాక్ షోలో పాల్గొని బాలయ్య బాబుతో సినిమా, లవ్, లైఫ్ వంటి అనేక విషయాలపై మనసు విప్పి మాట్లాడారు ఇద్దరు టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్. ఎవరనుకుంటున్నారా.. ఒకే ఒక జీవితంతో గ్రాండ్ సక్సెస్ అందుకుని ఫుల్ జోష్ లో ఉన్న శర్వానంద్, మేజర్ సినిమాతో పాన్ ఇండియా క్రేజ్ సంపాదించిన అడివి శేష్. మరి, ఈ ఎపిసోడ్ ఆహాలో ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతుందన్న విషయం ఇంకా తెలియాల్సి ఉంది.