నైట్రో స్టార్ సుధీర్ బాబు 18వ సినిమా ఇటీవలే అధికారికంగా ప్రకటింపబడిన విషయం తెలిసిందే. లేటెస్ట్ గా మేకర్స్ ఈ మూవీ కాన్సెప్ట్యుయల్ టైటిల్ వీడియోను కొంచెంసేపటి క్రితమే విడుదల చేసారు. "హరోంహర" అనే పవర్ఫుల్ అండ్ ఇంటెన్స్ టైటిల్ ను ఈ సినిమాకు ఫిక్స్ చేసారు. ఈ సినిమాతో సుధీర్ బాబు పాన్ ఇండియా బరిలోకి గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్నారు.
1989వ సంవత్సరంలో చిత్తూరు జిల్లా కుప్పం బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనున్న ఈ సినిమాలో సుధీర్ బాబు నెవర్ బిఫోర్ సీన్ మాస్ అవతార్ లో కనిపించబోతున్నారు. జ్ఞానసాగర్ ద్వారక ఈ సినిమాకు దర్శకుడు కాగా, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్ బ్యానర్ పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్నారు.
చైతన్ భరద్వాజ్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. రవితేజ గిరిజల ఎడిటర్ గా పని చేస్తున్నారు. ఈ సినిమాలో నటించబోయే ఇతర నటీనటులు, సాంకేతిక నిపుణుల గురించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.