కొంచెంసేపటి క్రితమే ఊర్వశివో రాక్షసివో థియేట్రికల్ ట్రైలర్ విడుదలైంది. అల్లు శిరీష్, అను ఇమ్మానుయేల్ జంటగా నటించిన ఈ సినిమాను రాకేష్ శశి డైరెక్ట్ చేసారు. ముందుగా విడుదలైన టీజర్ తో ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించిన ఈ సినిమా లేటెస్ట్ ట్రైలర్ తో చాలా మంచి అంచనాలను క్రియేట్ చేసింది. ట్రైలర్ ఆద్యంతం ఫన్ అండ్ ఎంటర్టైనింగ్ గా సాగింది. శిరీష్, వెన్నెల కిషోర్ కాంబో సీన్స్ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేలా ఉన్నాయి. శిరీష్, అను ఇమ్మానుయేల్ ల కెమిస్ట్రీ బాగా వర్క్ ఔటైనట్టు తెలుస్తుంది.
సునీల్, వెన్నెల కిషోర్, ఆమని, కేదార్ శంకర్ తదితరులు కీలకపాత్రలు పోషించిన ఈ సినిమాకు అచ్చు రాజమణి, అనూప్ రూబెన్స్ సంగీతం అందించారు. ధీరజ్ మొగిలినేని, విజయ్ M నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఈ సినిమాను అల్లు అరవింద్ గారు సమర్పిస్తున్నారు. పోతే, ఈ సినిమా నవంబర్ 4న గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.