కిమ్ కర్దాషియాన్ ఇన్‌స్టాగ్రామ్‌లో వెరైటీ డ్రెస్‌తో దర్శనమిచ్చింది. హాలోవీన్ కోసం 'X-మెన్' ఫ్రాంచైజీలో ఒక పాత్ర అయిన మిస్టిక్ తరహాలో దుస్తులు ధరించి, ఆ వీడియోలను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. కిమ్ కర్దాషియన్ సవతి సోదరి, మోడల్ కెండల్ జెన్నర్ కూడా 'టాయ్ స్టోరీ' ఫ్రాంచైజీకి చెందిన పాత్రగా ఆమె హాలోవీన్ రూపంలో దర్శనమిచ్చారు. ఇక కిమ్ డ్రెస్ చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. మతులు పోగొడుతున్నాయని కొందరు, ఇదేమి డ్రెస్ అని మరికొందరు కామెంట్లు చేస్తున్నారు.