ట్రెండింగ్
Epaper    English    தமிழ்

సోషల్ మీడియా లో జాన్వీ ఫోటో వైరల్

cinema |  Suryaa Desk  | Published : Wed, Dec 26, 2018, 07:23 PM

బాలీవుడ్ ద‌ర్శ‌కుడు కరణ్ జోహార్ దర్శక ..నిర్మాణంలో తెరకెక్కనున్న భారీ బడ్జెట్ చిత్రంలో న‌టిస్తుంది న‌టి జాన్వీక‌పూర్‌. తక్త్ అనే టైటిల్ తో రూపొందనున్న ఈ చిత్రంలో రణ్ వీర్ సింగ్ ప్రధాన పాత్ర పోషిస్తున్నాడు. ఐఏఎఫ్‌ విమానం నడిపిన తొలి మహిళా పైలట్‌ గుంజన్‌ సక్సేనా జీవిత‌మాధారంగా ఓ సినిమాని తెర‌కెక్కించాల‌ని ధ‌ర్మ ప్రొడ‌క్ష‌న్ భావిస్తున్న‌ట్టు ఇటీవ‌ల వార్త‌లు వ‌చ్చాయి . గుంజన్‌ పాత్రలో జాన్వీ న‌టిస్తుంద‌ని , ఇప్ప‌టికే ఆమెతో చ‌ర్చ‌లు కూడా జ‌రిపింద‌ని స‌మాచారం . జాన్వి, గుంజన్‌ కలిసి దిగిన ఫొటో కూడా అప్ప‌ట్లో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. తాజాగా పైల‌ట్ లుక్‌లో జాన్వీ ఫోటో ఒక‌టి సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతుంది. ఈ ఫోటోని చూసి అభిమానులు మురిసి పోతున్నారు. దుల్క‌ర్ స‌ల్మాన్ ఈ చిత్రంలో హీరోగా క‌నిపించ‌నున్నాడ‌ని స‌మాచారం.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa