టాలీవుడ్ చందమామ ప్రస్తుతం విశ్వనటుడు కమల్ హాసన్ తో కలిసి "ఇండియన్ 2" షూటింగ్ లో బిజీగా గడుపుతుంది. అంతేకాక పర్సనల్ లైఫ్ లోనూ నీల్ కు తల్లిగా కాజల్ కీలకపాత్రను పోషిస్తుంది.
తాజాగా ఆమె ప్రధాన పాత్ర పోషించిన "ఘోస్టీ" మూవీ టీజర్ విడుదలైంది. గతేడాదే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో కాజల్ మరియు యోగిబాబు ప్రధాన పాత్రలు పోషించారు. ఊర్వశి, రాధికా శరత్ కుమార్, KS రవికుమార్ కీలకపాత్రలు పోషించిన ఈ సినిమా హారర్ కామెడీ యాక్షన్ డ్రామాగా రూపొందింది. టీజర్ ఇంట్రెస్టింగ్ గా సాగింది.
గుళేబగావళి, జాక్ పాట్ సినిమాల దర్శకుడు కళ్యాణ్ ఈ సినిమాకు డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు. సీడ్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాకు సామ్ CS సంగీతం అందిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా థియేటర్లలో విడుదల కాబోతుంది.