ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అఫీషియల్ : అడివిశేష్ హిట్ 2 టీజర్ రిలీజ్ డేట్ ఫిక్స్

cinema |  Suryaa Desk  | Published : Mon, Oct 31, 2022, 05:20 PM

అడివిశేష్ హీరోగా నటిస్తున్న చిత్రం "హిట్ 2". శైలేష్ కొలను డైరెక్షన్లో క్రైం యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందిన ఈ సినిమాను వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మిస్తుండగా, నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు.


తాజాగా ఈ సినిమా నుండి మేకర్స్ టీజర్ రిలీజ్ డేట్ ను విభిన్నంగా ఎనౌన్స్ చేసారు. హిట్ 2 ప్రపంచాన్ని ప్రేక్షకులకు పరిచయం చేస్తూ , డైరెక్టర్ శైలేష్ చెప్పిన ఈ వీడియో సినిమాపట్ల ఒక క్లారిటీ ని ఇస్తుంది. పోతే, నవంబర్ 3వ తేదీన హిట్ 2 టీజర్ విడుదల కాబోతుంది. ఇందులో శేష్ కృష్ణదేవ్ అనే పోలీసాఫీసర్ గా నటించబోతున్నారు.


మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటించిన ఈ సినిమా డిసెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa