అక్కినేని నాగచైతన్య హీరోగా నటించిన "సాహసం శ్వాసగా సాగిపో" సినిమాతో కోలీవుడ్ హీరోయిన్ మంజిమా మోహన్ తెలుగు తెరకు పరిచయమైంది. ఆపై కథానాయకుడు, మహానాయకుడు సినిమాలలో గెస్ట్ రోల్ చేసింది. తెలుగులో అంతగా ప్రభావం చూపించని మంజిమాకు కోలీవుడ్, మాలీవుడ్ లలో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
లేటెస్ట్ గా మంజిమా మోహన్ కోలీవుడ్ టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ గా మారింది. ఎందుకంటే, తాను ప్రేమలో ఉన్నట్టు ఇన్స్టా పోస్ట్ ద్వారా అధికారికంగా వెల్లడించింది. మంజిమా ఎవరిని ప్రేమిస్తుందో తెలుసా... సీనియర్ హీరో కార్తీక్ కొడుకు గౌతమ్ కార్తీక్ ను. వీరిద్దరూ రిలేషన్ షిప్ లో ఉన్నారని ఎప్పటినుండో పుకార్లు నడిచినప్పటికీ, లేటెస్ట్ గానే ఇద్దరూ అధికారికంగా తాము ప్రేమలో ఉన్నట్టు ధృవీకరించారు.
మంజిమా, గౌతమ్ ఇద్దరూ కూడా తమ ఇన్స్టాగ్రామ్ ఖాతాలలో కొన్ని పిక్స్ ను పోస్ట్ చేసి, ఒక ఎమోషనల్ నోట్ ను షేర్ చేసుకున్నారు. త్వరలోనే ఇద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని టాక్.