ప్రముఖ టాలీవుడ్ నిర్మాత దిల్ రాజు గారు ఈ ఏడాది ఒక బాబుకు తండ్రైన విషయం తెలిసిందే కదా. దిల్ రాజు మొదటి భార్య అనిత అనారోగ్య సమస్యలతో అకాల మరణం చెందడంతో, వారి కూతురు హన్షిత రెడ్డి తండ్రికి దగ్గరుండి రెండో పెళ్లి చేయించింది. కరోనా లాక్ డౌన్ టైం లో దిల్ రాజు తేజస్విని అనే అమ్మాయిని రెండో వివాహం చేసుకున్నారు. వీరిద్దరూ కలిసి ఒక బాబుకు జన్మనిచ్చారు.
తాజాగా దిల్ రాజు వారసుడి ఫోటో ఒకటి బయటకు వచ్చింది. కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ తో దిల్ రాజు "వారిసు" తెలుగులో "వారసుడు" అనే సినిమాను చేస్తున్న విషయం తెలిసిందే కదా. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ లో జరగడం, విజయ్ దిల్ రాజు స్వగృహానికి వెళ్లడం, దిల్ రాజు వారసుడిని "వారసుడు" ఎత్తుకొని ముద్దాడడం జరిగింది. ఈ మేరకు విజయ్ దిల్ రాజు కొడుకుని ముద్దాడుతున్న ఫోటో ఒకటి మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. బాబు మాత్రం ఎంత క్యూట్ గా ఉన్నాడో..!!
వంశీ పైడిపల్లి డైరెక్షన్లో తెరకెక్కుతున్న వారసుడు మూవీ వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కాబోతుంది. ఇందులో రష్మిక మండన్నా హీరోయిన్ గా నటిస్తుంది.