ప్రముఖ బాలీవుడ్ హీరోయిన్ ఐశ్వర్యారాయ్ బచ్చన్ ఈ రోజు 49వ పుట్టినరోజును జరుపుకుంటుంది. ఈ సందర్భంగా అభిమానులు, పలువురు సినీ సెలెబ్రిటీలు ఆమెకు సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు.
రీసెంట్గా విడుదలైన పొన్నియిన్ సెల్వన్ సినిమాతో గ్రాండ్ సక్సెస్ ను అందుకున్న ఈ మంగుళూరు బ్యూటీ ఆ సినిమాలో తొలిసారిగా నెగిటివ్ రోల్ లో నటించి, ప్రేక్షకులను విశేషంగా మెప్పించింది.
1994 ప్రపంచ సుందరిగా వెలుగులోకి వచ్చిన ఐశ్వర్యా అప్పటి నుండి ఇప్పటివరకు కూడా మోస్ట్ బ్యూటిఫుల్ ఉమెన్ ఇన్ ది వరల్డ్ గా నిలుస్తూనే ఉంది. 1997లో మణిరత్నం డైరెక్టోరియల్ లో వచ్చిన ఇరువర్ సినిమాతో వెండితెరకు పరిచయమై, అప్రతిహతంగా తన సినీ కెరీర్ ను కొనసాగిస్తుంది.