మెగాపవర్ స్టార్ రాంచరణ్ టీం నుండి ఒక బిగ్ అప్డేట్ వచ్చింది. గతంలో ప్రకటింపబడిన విధంగా రాంచరణ్ తన 16వ సినిమాను జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరితో చేయట్లేదని క్లారిటీ ఇచ్చేసారు. కానీ , ఫ్యూచర్ లో ఈ కాంబోలో సినిమా వచ్చే అవకాశాలున్నాయని మాత్రం చూచాయగా చెప్పారు. RC 16 సినిమాకు సంబంధించిన అఫీషియల్ ఎనౌన్స్మెంట్ అతి త్వరలోనే రాబోతుందని పేర్కొన్నారు. ఖచ్చితంగా ఒక క్రేజీ కాంబోతోనే చెర్రీ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారని కూడా చెప్పారు.
దీంతో కన్నడ డైరెక్టర్ నార్తన్ తో చెర్రీ సినిమా కంఫర్మ్ అయ్యిందని సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతుంది. 2017లో వచ్చిన మఫ్టీ సినిమా డైరెక్ట్ చేసి విమర్శకుల ప్రశంసలు అందుకున్నారు కన్నడ డైరెక్టర్ నార్తన్.
చూడాలి మరి, ఏ క్రేజీ డైరెక్టర్ తో చెర్రీ తన 16వ సినిమాను చెయ్యనున్నాడో ..!! మెగా ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్ గా ఎదురుచూస్తున్నారు.