ఇలియానా డి క్రజ్ ... అభిమానులు ప్రేమతో ఇలియానా, ఇల్లు, బెల్లి బ్యూటీ అని పిలుచుకుంటారు. ఈ గోవా బ్యూటీ ఈ రోజు 36వ పుట్టినరోజును జరుపుకుంటుంది. దీంతో ఆమె డై హార్డ్ ఫ్యాన్స్ సోషల్ మీడియా ద్వారా పుట్టినరోజు శుభాకాంక్షలను తెలియచేస్తున్నారు. ఆమె నటించిన హిట్ మూవీ సాంగ్స్ ను పోస్ట్ చేస్తున్నారు.
రామ్ పోతినేని హీరోగా పరిచయమైన 'దేవదాస్' సినిమాతోనే ఇలియానా కూడా సినీ కెరీర్ ను స్టార్ట్ చేసింది. ఆపై అన్ని క్రేజీ ప్రాజెక్టుల్లోనే ఇలియానా భాగమైంది. పోకిరి, ఖతర్నాక్, రాఖి, మున్నా, జల్సా, కిక్, జులాయి వంటి సినిమాలలో హీరోయిన్ గా నటించి, స్టార్ హీరోయిన్ స్టేటస్ ను ఎంజాయ్ చేసింది. ఆపై ఉత్తరాదిలో అడుగుపెట్టిన ఇలియానా బర్ఫీ తో స్టార్ట్ చేసి, వరస క్రేజీ సినిమాలను చేసింది కానీ, ఏ సినిమా కూడా ఆమెకు సౌత్ క్రేజ్ ను నార్త్ లో తీసుకురాలేకపోయింది.
ప్రస్తుతం ఇలియానా ఫేడ్ ఔట్ అయిపోయిందని అంటున్నారు కానీ, ఫ్యాన్స్ లో ఆమె క్రేజ్ మాత్రం కూసింత కూడా తగ్గలేదు.