అడవి శేష్ నుండి రాబోతున్న సరికొత్త చిత్రం "హిట్ 2". 2020లో వచ్చిన సూపర్ హిట్ క్రైం యాక్షన్ థ్రిల్లర్ "హిట్" కు ఎక్స్టెండెడ్ వెర్షన్ గా రాబోతున్న ఈ సినిమాలో మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది. తాజాగా ఈ సినిమా నుండి మీనాక్షి చౌదరి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. ఇందులో మీనాక్షి 'ఆర్య' అనే గర్ల్ నెక్స్ట్ డోర్ పాత్రలో నటిస్తుంది.
వాల్ పోస్టర్ సినిమాస్ బ్యానర్ పై ప్రశాంతి నిర్మిస్తున్న ఈ సినిమాను నాచురల్ స్టార్ నాని సమర్పిస్తున్నారు. శైలేష్ కొలను డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నారు.
పోతే, ఈ చిత్రం డిసెంబర్ 2వ తేదీన గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. నవంబర్ 3వ తేదీన హిట్ 2 టీజర్ రిలీజ్ కాబోతుంది.