పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ క్రిష్ జాగర్లమూడి డైరెక్షన్లో నటిస్తున్న చిత్రం "హరిహర వీరమల్లు". మెగా సూర్య ప్రొడక్షన్స్ బ్యానర్ పై దయాకర రావు నిర్మిస్తున్న ఈ సినిమాను AM రత్నం నిర్మిస్తున్నారు.
పవన్ రాజకీయ కమిట్మెంట్స్ వల్ల సఫర్ అవుతున్న సినిమాలలో ప్రధాన పోషిస్తున్నది ఈ సినిమానే. అసలే పీరియాడికల్ మూవీ ... ఈ బ్యాక్ డ్రాప్ లో సినిమా అంటేనే చాలా సమయం పడుతుంది. దీనికి తగ్గట్టు పవన్ రాజకీయాలలో బిజీగా ఉండడంతో, ఈ సినిమా షూటింగ్ అంతకంతకూ ఆలస్యమవుతూ వస్తుంది. లేటెస్ట్ గానే ఈ సినిమా కొత్త షెడ్యూల్ స్టార్ట్ అయ్యింది. ముందుగా ఈ షెడ్యూల్ లో పవన్ పాల్గొన్నప్పటికీ ప్రస్తుతమైతే, పవన్ లేకుండానే పవన్ కి సంబంధించిన ఎపిసోడ్స్ ను షూట్ చేస్తున్నారట. అదెలా అనుకుంటున్నారా ... పవన్ డూప్లికేట్ ను పెట్టి ప్రస్తుత యాక్షన్ సీక్వెన్సెస్ ను కానిస్తున్నారట. ఎలాంటి క్లోజ్ అప్ షాట్స్ లేకుండా జాగ్రత్త పడుతున్నారట. ఈ మేరకు ఇండస్ట్రీలో జోరుగా టాక్ నడుస్తుంది. మరి, ఈ విషయంలో ఎంతవరకు నిజముందో తెలియాల్సి ఉంది.